ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు | Super- Substitute 'keeper puts Dutch into FIFA semis | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు

Jul 6 2014 9:08 AM | Updated on Sep 2 2017 9:54 AM

ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు

ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు

సాకర్ కప్ సెమీ ఫైనల్లోకి నెదర్లాండ్స్ దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో కోస్టారికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ 4-3 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.

సాల్వెడర్(బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి నెదర్లాండ్స్ దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో కోస్టారికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ 4-3 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో అర్జెంటీనాతో నెదర్లాండ్స్ తలపడనుంది.

నెదర్లాండ్స్‌, కోస్టారికా మధ్య జరిగిన చివరి క్వార్టర్‌ఫైనల్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించింది. నిర్ణీత 120 నిమిషాల సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ తో ఫలితాన్ని తేల్చారు. కీలకమైన ఈ షూటౌట్స్‌లో డచ్‌ గోల్‌కీపర్‌ టిమ్ క్రుల్‌ రెండు గోల్స్‌ అడ్డుకొని నెదర్లాండ్స్‌కు విజయం సాధించి పెట్టాడు. ఎక్స్‌ట్రా టైమ్‌ చివరి నిమిషంలో గోల్‌కీపర్‌ను మార్చడం డచ్‌ టీమ్‌కు కలిసొచ్చింది. సబ్స్టిట్యూట్ గోల్ కీపర్ గా వచ్చి అతడు జట్టుకు విజయాన్ని అందించడం విశేషం.

 కోస్టారికా ప్లేయర్స్‌ బ్రియన్ రూయిజ్‌, మైఖేల్ ఉమానా‌ కొట్టిన రెండు గోల్స్‌ను క్రుల్‌ అడ్డుకున్నాడు. అదే సమయంలో నెదర్లాండ్స్‌ తరఫున వాన్‌పెర్సీ, రాబెన్‌, స్నైడెర్‌, కుయ్‌ట్‌ గోల్స్‌ సాధించారు. దీంతో పెనాల్టీ షూటౌట్స్‌లో 4-3 తేడాతో గెలిచి సెమీస్‌ చేరింది నెదర్లాండ్స్‌. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్‌ ట్రా టైమ్‌లో ఎన్నోసార్లు గోల్స్‌ చేసే అవకాశమొచ్చనా సద్వినియోగం చేసుకోలేని డచ్‌ టీమ్.. మొత్తానికి షూటౌట్స్‌లో బతికిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement