breaking news
Goalkeeper Tim Krul
-
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
-
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో సెమీస్ బెర్తులు ఖరారు
సల్వాదార్(బ్రెజిల్): ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో క్వార్టర్స్ పోరుకు తెరపడింది. ఇక నాలుగు ప్రధాన జట్లు సెమీ ఫైనల్లో ఆమీతూమీకి సిద్ధమయ్యాయి. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ ల్లో భాగంగా శనివారం రాత్రి నెదర్లాండ్స్-కోస్టారికాల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో నెదర్లాండ్స్ జట్టు 4-3 తేడాతో కోస్టారికాను ఓడించి సెమీఫైనల్ కు ప్రవేశించింది. దీంతో సెమీస్ ఫైనల్ రేసులో తలపడే జట్లు ఖరారయ్యాయి. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జర్మనీ-బ్రెజిల్ లు తలపడుతుండగా, బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అర్జెంటీనా-నెదర్లాండ్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి.గత విజేత స్పెయిన్ తొలి రౌండ్ లోని నిష్కమించగా, రన్నరప్ నెదర్లాండ్స్ మాత్రం టోర్నీలో ఆకట్టుకుంటూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. -
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
సాల్వెడర్(బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి నెదర్లాండ్స్ దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో కోస్టారికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో అర్జెంటీనాతో నెదర్లాండ్స్ తలపడనుంది. నెదర్లాండ్స్, కోస్టారికా మధ్య జరిగిన చివరి క్వార్టర్‌ఫైనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. నిర్ణీత 120 నిమిషాల సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తో ఫలితాన్ని తేల్చారు. కీలకమైన ఈ షూటౌట్స్‌లో డచ్ గోల్‌కీపర్ టిమ్ క్రుల్ రెండు గోల్స్ అడ్డుకొని నెదర్లాండ్స్‌కు విజయం సాధించి పెట్టాడు. ఎక్స్ట్రా టైమ్ చివరి నిమిషంలో గోల్కీపర్ను మార్చడం డచ్ టీమ్‌కు కలిసొచ్చింది. సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ గా వచ్చి అతడు జట్టుకు విజయాన్ని అందించడం విశేషం. కోస్టారికా ప్లేయర్స్ బ్రియన్ రూయిజ్, మైఖేల్ ఉమానా కొట్టిన రెండు గోల్స్‌ను క్రుల్ అడ్డుకున్నాడు. అదే సమయంలో నెదర్లాండ్స్ తరఫున వాన్పెర్సీ, రాబెన్, స్నైడెర్, కుయ్ట్ గోల్స్ సాధించారు. దీంతో పెనాల్టీ షూటౌట్స్‌లో 4-3 తేడాతో గెలిచి సెమీస్ చేరింది నెదర్లాండ్స్. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ ట్రా టైమ్‌లో ఎన్నోసార్లు గోల్స్ చేసే అవకాశమొచ్చనా సద్వినియోగం చేసుకోలేని డచ్ టీమ్.. మొత్తానికి షూటౌట్స్‌లో బతికిపోయింది.