హరికృష్ణ అదుర్స్ | super hari krishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణ అదుర్స్

Sep 24 2014 1:05 AM | Updated on Sep 2 2017 1:51 PM

హరికృష్ణ అదుర్స్

హరికృష్ణ అదుర్స్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అరుదైన ఘనత సాధించాడు. స్పెయిన్‌లోని బిల్బావో నగరంలో జరిగిన యూరోపియన్ క్లబ్...

యూరోపియన్ క్లబ్ చెస్‌లో స్వర్ణ, రజత పతకాలు

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అరుదైన ఘనత సాధించాడు. స్పెయిన్‌లోని బిల్బావో నగరంలో జరిగిన యూరోపియన్ క్లబ్ కప్‌లో స్వర్ణ, రజత పతకాలను గెల్చుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఓ భారతీయ క్రీడాకారుడు వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. యూరోప్‌లోని 52 క్లబ్‌ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ చెక్ రిపబ్లిక్‌కు చెందిన జీ-టీమ్ నోవీ బోర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మూడో బోర్డుపై బరిలోకి దిగిన హరికృష్ణ ఏడు రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో నోవీ బోర్ రన్నరప్‌గా నిలిచింది.


 

Advertisement
 
Advertisement
Advertisement