సుమీత్‌ జంటకు టైటిల్‌  | Sumith And Manu Get Title In Nepal Open International Challenge Badminton Tournament | Sakshi
Sakshi News home page

సుమీత్‌ జంటకు టైటిల్‌ 

Nov 18 2019 3:29 AM | Updated on Nov 18 2019 3:29 AM

Sumith And Manu Get Title In Nepal Open International Challenge Badminton Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేపాల్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు సుమీత్‌ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి పురుషుల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించాడు. కఠ్మాండూలో ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 21–19, 21–15తో భారత్‌కే చెందిన ధ్రువ్‌ కపిల–ఎం.ఆర్‌.అర్జున్‌ జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో కె.మనీషా–రుతుపర్ణ (భారత్‌) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మనీషా–రుతుపర్ణ జంట 10–21, 21–18, 11–21తో టాప్‌ సీడ్‌ సెత్యానా మపాసా–గ్రోన్యా సోమర్‌విలె (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో సిరిల్‌ వర్మ 11–21, 16–21తో కావో క్వాంగ్‌ ఫామ్‌ (వియత్నాం) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement