సుమీత్ జంట సంచలనం | sumeet reddy team Whopper | Sakshi
Sakshi News home page

సుమీత్ జంట సంచలనం

Mar 5 2015 12:50 AM | Updated on Sep 4 2018 5:16 PM

సుమీత్ జంట సంచలనం - Sakshi

సుమీత్ జంట సంచలనం

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు.

ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీపై గెలుపు
 తొలి రౌండ్‌లోనే కశ్యప్ ఓటమి
 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ

 
 బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. తొలి రౌండ్‌లో సుమీత్-మనూ అత్రి ద్వయం 9-21, 21-17, 21-17తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట చాయ్ బియావో-మా జిన్ (చైనా) ను బోల్తా కొట్టించింది.
 
  మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21-12, 20-22, 21-14తో అమిలియా-ఫీ చో సూంగ్ (మలేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్  తొలి రౌండ్‌లో 13-21, 12-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-8, 21-12తో బెలాట్రిక్స్ మనుపుట్టి (ఇండోనేసియా)పై గెలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement