'ఊపిరున్నంత వరకు అలాగే ఉంటా' | Strongly condemn attempts to brand me an outsider: Sania Mirza | Sakshi
Sakshi News home page

'ఊపిరున్నంత వరకు అలాగే ఉంటా'

Jul 24 2014 2:23 PM | Updated on Sep 2 2017 10:49 AM

'ఊపిరున్నంత వరకు అలాగే ఉంటా'

'ఊపిరున్నంత వరకు అలాగే ఉంటా'

తాను భారతీయురాలినేనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తన ఊపిరున్నంత వరకు ఇండియన్ గానే ఉంటానని తెలిపింది.

హైదరాబాద్: తాను భారతీయురాలినేనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తన ఊపిరున్నంత వరకు ఇండియన్ గానే ఉంటానని తెలిపింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయడం తనను బాధించిందని పేర్కొంది. ఈ విషయంపై ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయింది.

తనను భారతీయురాలు కాదంటే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టింది. తనపై బయటివ్యక్తి(అవుట్సైడర్) ముద్ర వేయడాన్ని సానియా ఖండించింది. తన కుటుంబం శతాబ్దకాలంగా హైదరాబాద్ లో నివసిస్తోందని తెలిపింది. అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదని సూచించింది. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల బీజేపీ అభ్యంతరం చేసింది. పాకిస్థాన్ కోడలిని అంబాసిడర్ గా నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement