'నాకు స్థానం ఎందుకు లేదో తెలీదు' | Still waiting to know why Iam being rested, says Malinga | Sakshi
Sakshi News home page

'నాకు స్థానం ఎందుకు లేదో తెలీదు'

Dec 30 2017 1:59 PM | Updated on Nov 9 2018 6:46 PM

Still waiting to know why Iam being rested, says Malinga - Sakshi

కొలంబో:గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కారణంగా శ్రీలంక స్పీడ్‌స్టార్‌ లసిత్‌ మలింగాను జట్టులో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌తో జరిగిన ఓ టీ20లో మలింగ చివరిసారిగా ఆడాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరస్‌కు మలింగకు సెలక్టర్లు స్థానం కల్పించలేదు.అయితే తనను ఎంపిక చేయకపోవడం మలింగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'సెలక్టర్లు నన్ను జట్టులోకి తీసుకుంటే ఆడేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. వారు నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో కారణం తెలియట్లేదు.  ఆ కారణం కోసం ఎదురుచూస్తున్నా. 25, 26 ఏళ్ల వయసులో ఆటగాడికి విశ్రాంతి అవసరం. ఎందుకంటే అతడు భవిష్యత్తులో ఇంకా క్రికెట్‌ ఆడే అవకాశం ఉంటుంది. నా వయసు వారికి విశ్రాంతి అవసరం లేదు.  వీలైనంత ఎక్కువ క్రికెట్‌ ఆడాలని మాకు ఉంటుంది. 2019 వరల్డ్‌ కప్‌ ఆడటమే నా ముందున్న లక్ష్యం' అని మలింగా పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement