ఇంకా ఆ షాక్లోనే ఉన్నా: అఖిల్ | Still in shock , 2 runs to win off 1 ball with MSD on strike, says akhil akkineni | Sakshi
Sakshi News home page

ఇంకా ఆ షాక్లోనే ఉన్నా: అఖిల్

Aug 28 2016 3:10 PM | Updated on Sep 4 2017 11:19 AM

ఇంకా ఆ షాక్లోనే ఉన్నా: అఖిల్

ఇంకా ఆ షాక్లోనే ఉన్నా: అఖిల్

ఒంటి చేత్తో భారత్కు ఎన్నో విజయాలను అందించిన ఘనత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది. అయితే ఫ్లోరిడాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో చివరి బంతికి ఒక పరుగు చేయాలి.

హైదరాబాద్: ఒంటి చేత్తో భారత్కు ఎన్నో విజయాలను అందించిన ఘనత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది. ఫ్లోరిడాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో చివరి బంతికి  ఒక పరుగు చేయాల్సిన సమయంలో క్రీజ్లో ఉన్నది కూడా ధోనినే.  ఇక మ్యాచ్ భారత్ దే అని అంతా అనుకున్నారు. అయితే అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న ధోనికి ఒక పరుగు చేయడంలో తడబడ్డాడు. ధోని థర్డ్ మ్యాన్ దిశగా కొట్టిన బంతి గాల్లోకి లేవడంతో శామ్యూల్స్ పట్టేశాడు. ఇలా ధోని అవుట్ కావడం అభిమానుల్ని షాక్ కు గురి చేసింది. ఇలా షాక్ తిన్నవారిలో యువ హీరో అఖిల్ అక్కినేని కూడా ఉన్నాడట. ఈ మ్యాచ్పై అఖిల్ ట్విట్టర్ లో  స్పందిస్తూ.. ఇది ఒక అరుదైన మ్యాచ్గా పేర్కొన్నాడు.

 

' నిజంగా ఇది అద్భుతమైన మ్యాచ్. మ్యాచ్ చూస్తున్నంతసేపు నరాలు తెగే ఉత్కంఠ.  ఈ మ్యాచ్లో చివరి బంతికి భారత్ విజయానికి రెండు పరుగులు కావాలి. అప్పుడు స్ట్రైకింగ్లో ధోని ఉండటంతో మ్యాచ్పై చాలా ఆశలు పెట్టుకున్నా. అయితే ధోని అవుట్ కావడంతో మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా ఆ షాక్లోనే ఉన్నా. ఇక్కడ ధోని కూడా నిందించలేం. అతను కూడా మానవమాత్రుడే కదా' అని అఖిల్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement