రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌ షురూ | State-level Taekwondo Championship begins | Sakshi
Sakshi News home page

Feb 16 2018 8:00 AM | Updated on Feb 16 2018 8:01 AM

State-level Taekwondo Championship begins - Sakshi

తైక్వాండో చాంపియన్‌షిప్‌ ప్రారంభిస్తున్న మంత్రి మహేందర్‌ రెడ్డి

గచ్చిబౌలి : చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ తెలంగాణ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి, ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.

తెలంగాణ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో  జరిగే ఈ టోర్నీలో 31 జిల్లాలకు చెందిన 3000 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. చాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్‌ సాయి బాబా, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం అధ్యక్షుడు మూట శ్రీనివాస్, కార్యదర్శి కె. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement