క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక | Srivalli Rashmika in Quarters of ITF Tennis Tourney | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక

Nov 29 2018 10:20 AM | Updated on Nov 29 2018 10:20 AM

Srivalli Rashmika in Quarters of ITF Tennis Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–4 టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–3, 6–3తో అనన్య గోయెల్‌పై గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్‌లో రష్మిక 6–3, 6–3తో జగ్‌మీత్‌ కౌర్‌ను ఓడించింది. మరో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ శివాని అమినేని 6–3, 6–4తో సారా దేవ్‌పై నెగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement