బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ! | Srinivasn can't take charge of BCCI till cleared by Mudgal Committee:Supreme Court | Sakshi
Sakshi News home page

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ!

Sep 1 2014 8:44 PM | Updated on Sep 2 2018 5:20 PM

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ! - Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఎదురుదెబ్బ!

బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్దల్ కమిటీ విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీనివాసన్  బీసీసీఐ పదవీ బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చించింది. 
 
అంతేకాక ఏపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ముగ్దల్ కమిటీ జరుపుతున్న దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆసంతృప్తిని వెల్లగక్కింది. అంతేకాక కమిటీ దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ముగ్దల్ కమిటీని ఆదేశించింది. 
 
వార్షిక సాధారణ సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని శ్రీనివాసన్ చేసిన విజ్క్షప్తిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ ఇబ్రహీం కలీఫుల్లా కూడిన బెంచ్ తోసిపుచ్చింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement