రెండో వన్డేలో లంక విజయం | Srilanka won 2nd ODI against England | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో లంక విజయం

Nov 30 2014 12:35 AM | Updated on Sep 2 2017 5:21 PM

రెండో వన్డేలో లంక విజయం

రెండో వన్డేలో లంక విజయం

భారత్‌తో సిరీస్‌లో చిత్తుగా ఓడిన శ్రీలంక... ఇంగ్లండ్‌పై మాత్రం చెలరేగిపోతోంది. వరుసగా రెండో వన్డేలో కుక్ సేనను ఆతిథ్య శ్రీలంక చిత్తు చేసింది.

రాణించిన సంగక్కర, జయవర్ధనే
 
 కొలంబో: భారత్‌తో సిరీస్‌లో చిత్తుగా ఓడిన శ్రీలంక... ఇంగ్లండ్‌పై మాత్రం చెలరేగిపోతోంది. వరుసగా రెండో వన్డేలో కుక్ సేనను ఆతిథ్య శ్రీలంక చిత్తు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లంక ఎనిమిది వికెట్లతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 43 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటయింది. బొపారా (69 బంతుల్లో ఒక ఫోర్‌తో 51), జో రూట్ (57 బంతుల్లో ఒక ఫోర్‌తో 42) మినహా అందరూ విఫలమయ్యారు.

లంక బౌలర్లలో అజంతా మెండిస్ మూడు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక జట్టు 34.2 ఓవర్లలో 2 వికెట్ల నస్టానికి 186 పరుగులు చేసి గెలిచింది. సీనియర్ ద్వయం సంగక్కర (93 బంతుల్లో 8 ఫోర్లతో 67 నాటౌట్), జయవర్ధనే (80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 77 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఏడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే బుధవారం జరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement