ట్వంటీ 20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ విజయలక్ష్యం 190 | srilanka set target of 190 for england | Sakshi
Sakshi News home page

ట్వంటీ 20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ విజయలక్ష్యం 190

Mar 27 2014 8:52 PM | Updated on Nov 9 2018 6:43 PM

ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ గురువారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ గురువారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులకు ఆదిలోనే పెరీరా(3) ను వికెట్టును చేజార్చుకుని కష్టాల్లో పడినట్లు కనిపించింది.  ఆ తరుణంలో మరో ఓపెనర్ దిల్షాన్ కు జయవర్దనే జత కలవడంతో  జట్టు స్కోరు నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇరువురూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. దిల్షాన్ (55), జయవర్దనే(89) పరుగులతో ఆకట్టుకుని శ్రీలంకకు  మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

 

చివరిలో తిషారా పెరీరా(23)  బాధ్యతగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, డెర్న్ బ్యాచ్ చెరో రెండు వికెట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement