శ్రీలంక 220/5 | Srilanka made 220/5 | Sakshi
Sakshi News home page

శ్రీలంక 220/5

Jan 17 2014 1:23 AM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంక 220/5 - Sakshi

శ్రీలంక 220/5

శ్రీలంకతో గత టెస్టు పరాజయంనుంచి పాకిస్థాన్ కొంత మేరకు కోలుకుంది. జట్టు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తొలి రోజు నిలువరించగలిగారు.

షార్జా: శ్రీలంకతో గత టెస్టు పరాజయంనుంచి పాకిస్థాన్ కొంత మేరకు కోలుకుంది. జట్టు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తొలి రోజు నిలువరించగలిగారు. ఫలితంగా ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో గురువారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు చాలా కష్టంగా మారిన నెమ్మదైన పిచ్‌పై సంగక్కర (52), మహేల జయవర్ధనే (47) మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ప్రస్తుతం ప్రసన్న జయవర్ధనే (28 బ్యాటింగ్), మాథ్యూస్ (24 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
 
  అజ్మల్‌కు 2 వికెట్లు దక్కాయి. పాక్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు అంపైర్ల సమీక్షా నిర్ణయాలు కూడా ఆ జట్టుకు వ్యతిరేకంగా రావడంతో లంక ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి టెస్టు డ్రా కాగా, రెండో మ్యాచ్ నెగ్గిన లంక 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా...1999-2000 తర్వాత (బంగ్లా, జింబాబ్వేలను మినహాయిస్తే) విదేశాల్లో శ్రీలంకకు ఇదే తొలి సిరీస్ విజయమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement