శ్రీలంక క్రికెటర్‌ తలకు గాయం | Sakshi
Sakshi News home page

శ్రీలంక క్రికెటర్‌ తలకు గాయం

Published Thu, Nov 1 2018 11:13 AM

Sri Lankan player struck on helmet in warm up game vs England - Sakshi

కొలంబో: శ్రీలంక క్రికెటర్‌ పాతుమ్‌ నిస్సాంకా తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. బుధవారం లంక బోర్డ్‌ లెవన్‌తో ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కొట్టిన ఓ బలమైన షాట్‌.. షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా తలకు గట్టిగా తాకడంతో అతడు కుప్పకూలిపోయాడు. దాంతో అతన్ని స్ట్రెచర్‌పై తీసుకెళ్లిన స్టేడియం సిబ్బంది.. ప్రాథమిక చికిత్స కోసం దగ్లర్లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిస్సాంకా ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నిషాన్‌ పైరిస్‌ వేసిన 56వ ఓవర్‌ రెండో బంతిని జోస్‌ బట్లర్‌ షాట్‌ కొట్టే యత్నం చేశాడు. ఇది కాస్తా ఫైన్‌ లెగ్‌లో ఫీల‍్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా హెల్మెట్‌ కింద భాగాన తగిలింది. దాంతో నిస్సాన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతన్ని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించడంతో ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలియజేశారు. కాగా, నిస్సాన్‌ హెల్మెట్‌కు తగిలిన బంతి కాస్తా లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఏంజెలో మాథ్యూస్‌ చేతిలో పడింది. ఫలితంగా బట్లర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఈ రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement