ఆర్సీబీ లక్ష్యం 176 | SRH Set Target of 176 Runs Against RCB | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ లక్ష్యం 176

May 4 2019 9:48 PM | Updated on May 4 2019 9:57 PM

SRH Set Target of 176 Runs Against RCB - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 46 పరుగుల వద్ద సాహా(20) వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపటికి గప్టిల్‌(30), మనీష్‌ పాండే(9) వికెట్లను కోల్పోవడంతో 61 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్‌. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌- విజయ్‌ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.  వీరిద్దరూ 45 పరుగులు జోడించిన తర్వాత విజయ్‌ శంకర్‌(27) పెవిలియన్‌ చేరాడు.

అటు తర్వాత స్వల్ప వ్యవధిలో యూసఫ్‌ పఠాన్‌(3), నబీ(4),  రషీద్‌ ఖాన్‌(1)లు పెవిలియన్‌ చేరారు. కానీ విలియమ్సన్‌(70 నాటౌట్‌; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. విలియమ్సన్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు సాధించగా, నవదీప్‌ షైనీ రెండు వికెట్లు తీశాడు. చహల్‌, ఖేజ్రోవాలియాలకు తలో వికెట్‌ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement