కంగారూలు తిప్పేశారు.. | Spinners Shine as Australia Crush West Indies | Sakshi
Sakshi News home page

కంగారూలు తిప్పేశారు..

Jun 6 2016 8:42 AM | Updated on Sep 4 2017 1:50 AM

కంగారూలు తిప్పేశారు..

కంగారూలు తిప్పేశారు..

ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో విజయం సాధించింది.

గుయానా: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్లు ఆడమ్ జంపా (3/16), నాథన్ లియాన్ (3/39) విజృంభించి విండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 32.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటయ్యారు. విండీస్ జట్టులో ఓపెనర్ చార్లెస్ (22) టాప్ స్కోరర్.

అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కంగారూలు 25.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (55) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. భారీ విజయం సాధించిన ఆసీస్కు బోనస్ సహా 5 పాయింట్లు దక్కాయి. ఈ సిరీస్లో తొలి వన్డేలో వెస్టిండీస్.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement