దక్షిణ మధ్య రైల్వేకే టైటిల్ | south central railway gets kabaddi title | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వేకే టైటిల్

Sep 3 2016 10:32 AM | Updated on Aug 28 2018 7:57 PM

బృహత్ బెంగళూరు మహానగర ఆలిండియా ఏ- గ్రేడ్ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు కైవసం చేసుకుంది.

బృహత్ బెంగళూరు మహానగర కబడ్డీ టోర్నమెంట్
 
 సాక్షి, హైదరాబాద్: బృహత్ బెంగళూరు మహానగర ఆలిండియా ఏ- గ్రేడ్ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు కైవసం చేసుకుంది. అంతర్ రైల్వేస్ టోర్నమెంట్‌లో భాగంగా బెంగళూరులో ఆగస్టు 28న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) 23-13తో వెస్టర్న్ రైల్వేస్ జట్టుపై నెగ్గింది.

 

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎస్‌సీఆర్ 12-8తో ఎస్‌ఎంసీ జట్టుపై గెలుపొందింది. ఈ టోర్నీలో ఆద్యంతం రాణించిన తేజస్వినికి బెస్ట్ ఆల్‌రౌండర్ అవార్డు లభించగా... పింకీ రాయ్‌కి బెస్ట్ క్యాచర్ ప్రైజ్ లభించింది. టైటిల్ సాధించిన జట్టు క్రీడాకారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అభినందించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement