దక్షిణాఫ్రికాపై మాదే పైచేయి | South Africa were lucky to survive on last day, says Cheteshwar Pujara | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాపై మాదే పైచేయి

Dec 25 2013 12:52 AM | Updated on Sep 2 2017 1:55 AM

ప్రాక్టీస్‌లో ధోని, ఓజా

ప్రాక్టీస్‌లో ధోని, ఓజా

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును దాదాపు ఓడించినంత పనిచేసిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్టుపై దృష్టి సారించింది.

 డర్బన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును దాదాపు ఓడించినంత పనిచేసిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్టుపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలో వారిపై మాన సికంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. వాండరర్స్ టెస్టులో దక్షిణాఫ్రికాకన్నా తమ జట్టే మెరుగ్గా ఆడిందని భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘చివరి మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే దక్షిణాఫ్రికా కన్నా మాకే ఎక్కువ సానుకూలాంశాలున్నాయి.
 
  పరాజయం తప్పించుకున్నందుకు వారు అదృష్టవంతులు. చివర్లో వారు విజయం కోసం ప్రయత్నించలేకపోయారు. ఎందుకంటే మా బౌలింగ్‌పై వారికి పూర్తి నమ్మకం ఉంది. టెయిలెండర్లపై వారు విశ్వాసం ఉంచలేకపోయారు’ అని పుజారా అన్నాడు.  మరోవైపు రెండో టెస్టు కోసం భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. మంగళవారం ఆటగాళ్లంతా నెట్స్‌లో గడిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement