ఫాలో ఆన్‌లో విండీస్ | south africa first test match | Sakshi
Sakshi News home page

ఫాలో ఆన్‌లో విండీస్

Dec 20 2014 12:19 AM | Updated on Sep 2 2017 6:26 PM

దక్షిణాఫ్రికా పేసర్లు ఫిలాండర్ (4/29), మోర్నీ మోర్కెల్ (3/55) బౌలింగ్ ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు
 సెంచూరియన్: దక్షిణాఫ్రికా పేసర్లు ఫిలాండర్ (4/29), మోర్నీ మోర్కెల్ (3/55) బౌలింగ్ ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. సూపర్‌స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. డెవాన్ స్మిత్ (74 బంతుల్లో 35; 6 ఫోర్లు), బ్రాత్‌వైట్ (61 బంతుల్లో 34; 5 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (66 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
 
 తొలి వికెట్‌కు 72 పరుగులు జత చేరినా ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. దీంతో సఫారీ జట్టుకు 351 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం ఫాలోఆన్ ఆడేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో లియోన్ జాన్సన్ (73 బంతుల్లో 33 బ్యాటింగ్; 6 ఫోర్లు), శామ్యూల్స్ (26 బంతుల్లో 13 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. విండీస్ ఇంకా 275 పరుగులు వెనుకబడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement