సౌరవ్‌ ఓటమి | Sourav's defeat | Sakshi
Sakshi News home page

సౌరవ్‌ ఓటమి

Oct 22 2017 2:35 AM | Updated on Oct 22 2017 2:35 AM

Sourav's defeat

న్యూఢిల్లీ: చానెల్‌ వాస్‌ చాంపియన్‌షిప్‌ అంతర్జాతీయ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు సౌరవ్‌ ఘోషాల్‌ పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌లోని సర్రేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో సౌరవ్‌ 11–13, 8–11, 9–11తో టాప్‌ సీడ్‌ మొహమ్మద్‌ ఎల్‌షోర్‌బగీ (ఈజిప్ట్‌) చేతిలో ఓటమి చవిచూశాడు.

అంతకుముందు సౌరవ్‌ తొలి రౌండ్‌లో 11–7, 11–7, 11–2తో మర్వాన్‌ ఎల్‌షోర్‌బగీ (ఈజిప్ట్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 11–9, 5–11, 8–11, 11–3, 11–8తో ఎనిమిదో సీడ్‌ మొహమ్మద్‌ అబుల్‌గర్‌ (ఈజిప్ట్‌)పై గెలిచాడు.  

జోష్నా, దీపిక నిష్క్రమణ: మరోవైపు న్యూయార్క్‌లో జరుగుతున్న కారోల్‌ వేముల్లర్‌ ఓపెన్‌లో భారత స్టార్స్‌ జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. జోష్నా 11–9, 11–13, 16–14, 5–11, 10–12తో సల్మా హనీ (ఈజిప్ట్‌) చేతిలో... దీపిక 8–11, 6–11, 7–11తో రానీమ్‌ ఎల్‌ వెలిలీ (ఈజిప్ట్‌) చేతిలో ఓడిపోయారు.
ఆంధ్ర రంజీ జట్టుకు

Advertisement
 
Advertisement
Advertisement