టైటిల్‌ పోరుకు అనాహత్‌ సింగ్‌ | Anahat Singh Advances to Indian Open Squash Tournament Title Clash | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు అనాహత్‌ సింగ్‌

Mar 22 2026 3:32 AM | Updated on Mar 22 2026 3:32 AM

Anahat Singh Advances to Indian Open Squash Tournament Title Clash

ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియన్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌కే టైటిల్‌ లభించనుంది. ఎందుకంటే భారత్‌కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్‌ సింగ్, వీర్‌ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్, టాప్‌ సీడ్‌ అనాహత్‌ సింగ్‌ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. 

శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్‌ అనాహత్‌ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ హనా మొతాజ్‌ (ఈజిప్‌్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో వీర్‌ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్‌ జీవా (మలేసియా)పై, అభయ్‌ సింగ్‌ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్‌రాజ్‌ చందారన్‌ (మలేసియా)పై విజయం సాధించారు.   

Advertisement
 
Advertisement
Advertisement