ఆ పోస్ట్‌ నిజం కాదు : గంగూలీ

Sourav Ganguly Says His Daughter Post On CAA Is Not True - Sakshi

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కుమార్తె సనా సీఏఏకు వ్యతిరేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కుశ్వంత్‌ సింగ్‌ రాసిన ‘ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తకంలోని సందేశాన్ని సనా ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్‌ చేశారనేది ఆ వార్తల సారాంశం. అయితే ఆ వార్తలపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. మరికొందరు సనాను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

దీనిపై స్పందించిన గంగూలీ.. ఆ పోస్ట్‌ నిజం కాదని తెలిపారు. సనా చాలా చిన్న పిల్ల అని.. తనను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘ఈ వివాదాలకు సనాను దూరంగా ఉంచండి. ఆ పోస్ట్‌ నిజమైనది కాదు. తనది రాజకీయాల గురించి తెలుసుకునే వయస్సు కాదు’ అని పేర్కొన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top