పంజాబ్ కు ధీటుగా బదులిస్తున్న కోల్ కతా | Solid start for kolkata in 150 chase | Sakshi
Sakshi News home page

పంజాబ్ కు ధీటుగా బదులిస్తున్న కోల్ కతా

May 11 2014 6:21 PM | Updated on Sep 2 2017 7:14 AM

పీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కోతా నైట్ రైడర్స్ ధీటుగా బదులిస్తోంది

కటక్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కోతా నైట్ రైడర్స్ ధీటుగా బదులిస్తోంది. పంజాబ్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గంభీర్, ఉతప్పలు ఆరంభించారు. కోల్ కతా 6.2 ఓవర్ల ముగిసే సరికి వికెట్టు నష్టపోకుండా  63  పరుగులు ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం గంభీర్(13), ఉతప్ప(46) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు టాస్ ఓడి పంజాబ్ బ్యాటింగ్ చేసింది.పంజాబ్ ఓపెనర్ మన్ దీప్ సింగ్ (0)కే పెవిలియన్ కు చేరినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ (72) పరుగులతో ఆకట్టుకున్నాడు.

 

అనంతరం మ్యాక్స్ వెల్ (14), సాహా(15), మిల్లర్ (13), బెయిలీ(12) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు మూడు వికెట్లు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement