అబ్బా స్మృతి.. సెంచరీ మిస్‌

Smriti Mandhana Misses Century - Sakshi

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌ మహిళలతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన శతకాన్ని చేజార్చుకుంది. 62 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 86 పరుగులు చేసిన మంధాన.. డెవిన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు దాటిగా ఆడుతూ స్మృతి మంధాన మంచి శుభారంభాన్ని అందించింది. ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. తన బ్యాటింగ్‌లో ఏ మాత్రం వేగం తగ్గించని మంధాన.. 33 బంతుల్లో కెరీర్‌లో 8వ హాఫ్‌ సెంచరీ పూర్తిగా చేసుకుంది. మంచి షాట్లతో అలరించింది. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో భారీ షాట్‌కు ప్రయత్నించి నిరాశగా పెవిలియన్‌ చేరింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top