సింధు జోరు | Sindhu sails into semifinals of Denmark Open | Sakshi
Sakshi News home page

సింధు జోరు

Oct 17 2015 2:56 PM | Updated on Sep 3 2017 11:06 AM

సింధు జోరు

సింధు జోరు

రెండు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ అమ్మాయి పివి సింధు డెన్మార్క్ ఓపెన్ లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది.

ఒడెన్స్:రెండు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత, హైదరాబాద్ అమ్మాయి పివి సింధు డెన్మార్క్ ఓపెన్ లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. నిన్న ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరిన సింధు.. ఈరోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా శనివారం జరిగిన పోరులో సింధు 21-18, 21-19 తేడాతో మాజీ నంబర్ వన్ వాంగ్ యిహాన్ (చైనా)పై వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ కు చేరింది.

 

45 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. సెమీ ఫైనల్లో సింధు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ తో ఆడనుంది. ఇద్దరి రికార్డులను పరిశీలిస్తే మారిన్ దే పై చేయిగా ఉంది. అంతకుముందు ఇరువురి మధ్య జరిగిన గత మూడు మ్యాచ్ ల్లో మారిన్ విజయం సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement