కోహ్లి ఒక ఉఫ్‌.. అయ్యర్‌ మరొక ఉఫ్‌! | Shreyas Iyer Surprises Himself With Monster Six | Sakshi
Sakshi News home page

కోహ్లి ఒక ఉఫ్‌.. అయ్యర్‌ మరొక ఉఫ్‌!

Jan 9 2020 11:24 AM | Updated on Jan 9 2020 11:30 AM

 Shreyas Iyer Surprises Himself With Monster Six - Sakshi

ఇండోర్‌: తన హావభావాలను ప్రదర్శించడంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆట ఆడుతున్న సమయంలో కానీ, స్టేడియంలో కూర్చొని ఉన్న సమయంలో కానీ ఏది చేయాలనిపిస్తే అది తన ఎక్స్‌ప్రెషన్స్‌తో చూపిస్తూ ఉంటాడు కోహ్లి. ఇది కొన్ని సందర్భాల్లో అభిమానులకు సైతం నవ్వులు తెప్పిస్తూ ఉంటుంది. మంగళవారం ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో కోహ్లికి అయ్యర్‌ కొట్టిన సిక్స్‌ చూసి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది 101 కి.మీ దూరంగా అయ్యర్‌ కొట్టిన భారీ హిట్‌కు కోహ్లి ఫిదా అయ్యాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి ఫన్నీ మీమ్స్‌ వైరల్‌..)

దాంతో వెంటనే ‘ఉఫ్‌’ అంటూ తన హావభావాల్ని ప్రదర్శించాడు. అయితే తన సిక్స్‌ను తానే నమ్మలేకపోయినా అయ్యర్‌ కూడా కోహ్లినే ఫాలో అయ్యాడు. అచ్చం కోహ్లి తరహాలోనే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు అయ్యర్‌. శ్రీలంక బౌలర్‌ వేసిన 17 ఓవర్‌ ఆఖరి బంతికి అయ్యర్‌ సిక్స్‌ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు, సైనీ, కుల్దీప్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌లకు చెరో వికెట్‌ దక్కింది. భారత బౌలర్ల వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో లంకేయులు భారీ స్కోరును సాధించలేకపోయారు.ఆపై 143 లక్ష్యంతో ఇన్నింగ్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌(45), శిఖర్‌ ధావన్‌(32)లు శుభారంభం ఇవ్వగా, కోహ్లి( 30 నాటౌట్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement