
స్వీడిష్ ఓపెన్ నుంచి సెరెనా అవుట్
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్వీడిష్ ఓపెన్ కు దూరమైంది.
స్టాక్ హోమ్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్వీడిష్ ఓపెన్ కు దూరమైంది. మోచేయి గాయం కారణంగా ఆమె ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది.
'బంతి తగలడంతో మోచేతికి గాయమైంది. దీంతో సమస్య ఎదుర్కొంటున్నా. గాయం పెద్దది కాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో స్వీడిష్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నా' అని సెరెనా విలియమ్స్ పేర్కొంది. తాజాగా ముగిసిన వింబుల్డన్ టోర్నిలో మహిళల సింగిల్స్ టైటిల్ ను సెరెనా గెల్చుకుంది. ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టైటిల్ ను కైవసం చేసుకుంది.