Met Gala 2023: Serena Williams Reveals Second Pregnancy, Flaunts Baby Bump - Sakshi
Sakshi News home page

Met Gala 2023: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్‌ కార్పెట్‌పై బేబీ బంప్‌తో! ఫొటోలు వైరల్‌

May 2 2023 4:21 PM | Updated on May 2 2023 4:50 PM

Met Gala 2023: Serena Williams Reveals Second Pregnancy Shows Baby Bump - Sakshi

Serena Williams Reveals Second Pregnancy: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌ మరోసారి తల్లికాబోతోంది. తన చిన్నారి కూతురు ఒలింపియా కోరినట్లుగానే తోబుట్టువును బహుమతిగా ఇవ్వబోతోంది. మెట్‌ గాలా-2023 ఈవెంట్‌ వేదికగా తాను మరోసారి గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది సెరీనా.

బేబీ బంప్‌ ప్రదర్శిస్తూ
భర్త అలెక్సిస్‌ ఒహనియన్‌తో కలిసి సెరీనా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో సందడి చేసింది. నల్లటి గౌన్‌కు తెలుపు రంగు స్కర్ట్‌ జతచేసిన ఈ అమెరికా నల్లకలువ.. ముత్యాల హారం ధరించి మెరిసిపోయింది. నిండైన అవుట్‌ఫిట్‌లో రెడ్‌కార్పెట్‌పై బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

మేము ముగ్గురం
ఇక సెరీనా భర్త బ్లాక్‌ కలర్‌ టక్సిడో ధరించి ఆమెను మ్యాచ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసి మురిసిపోయింది సెరీనా. ‘‘మా ముగ్గురికీ మెట్‌ గాలాలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించాం’’ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి హింట్‌ ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది.

చాంపియన్‌గా సత్తా చాటి
కాగా అమెరికాకు చెందిన సెరీనా.. టెన్నిస్‌ స్టార్‌గా వెలుగొందింది. 1995లో ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆమె.. ఏకంగా 23 సింగిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచింది. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడుతున్న సమయంలో రెండు నెలల గర్భంతో ఉన్న సెరీనా చాంపియన్‌గా నిలిచింది. 

కూతురికి జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఆమె.. కొన్నాళ్ల తర్వాత తిరిగివచ్చినా గాయం కారణంగా 2022లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమైంది. ఈ క్రమంలో గతేడాది ఆగష్టు 9న ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఆమె.. తాను రిటైర్‌ అవ్వలేదంటూ అక్టోబరులో సంకేతాలు ఇచ్చింది. కానీ మళ్లీ ఇంతవరకు కోర్టులో దిగలేదు.


రోజర్‌ ఫెదరర్‌ సైతం

ఇక ఇప్పుడు తన కుటుంబం పెద్దది కాబోతోందంటూ అభిమానులకు శుభవార్త చెప్పింది. కాగా స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సైతం ఈ ఈవెంట్‌లో సందడి చేయడం విశేషం. 

చదవండి: ఎదుటివాళ్లకు ఇచ్చినపుడు.. నువ్వు కూడా తీసుకోవాలి.. లేదంటే: కోహ్లి కామెంట్స్‌ వైరల్‌
IPL 2023: ఈ సాలా కప్‌ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్‌ మాతోనే ఉన్నాడు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement