ఇషాంత్ను ఆటపట్టించిన సెహ్వాగ్ ట్వీట్ | Sehwag put nick name to Ishant Sharma on twitter | Sakshi
Sakshi News home page

ఇషాంత్ను ఆటపట్టించిన సెహ్వాగ్ ట్వీట్

Sep 3 2016 11:38 AM | Updated on Sep 4 2017 12:09 PM

ఇషాంత్ను ఆటపట్టించిన సెహ్వాగ్ ట్వీట్

ఇషాంత్ను ఆటపట్టించిన సెహ్వాగ్ ట్వీట్

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వరుస ట్వీట్లతో తన ఫాలోయర్స్ ను అలరిస్తున్నాడు.

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వరుస ట్వీట్లతో తన ఫాలోయర్స్ ను అలరిస్తున్నాడు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక.. మైదానంలో బౌలర్లపైనే కాదు సోషల్ మీడియాలోనూ దూకుడుగా ఉంటాడని వీరూ నిరూపించాడు. విషయం ఏంటంటే.. శుక్రవారం(సెప్టెంబర్ 2న) టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ పుట్టినరోజు. ట్విట్టర్ ద్వారా ఇషాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే వీరూ తన ట్వీట్ లో ఇషాంత్కు కొత్త నిక్ నేమ్ పెట్టాడు. టీమిండియా జట్టులో ఇషాంత్ ఎత్తయిన ఆటగాడు కావడంతో  ప్రపంచంలో ఎత్తైయిన నిర్మాణాలలో ఒకటైన బూర్జ్ ఖలీఫాతో పోల్చాడు. బాల్ వాలే బూర్జ్ ఖలీఫా, శర్మాజీకా లడ్కా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ లో ఆటపట్టించాడు. ఇషాంత్ ను ఎంపిక చేసుకుంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారని సెహ్వాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement