చివరి క్షణాల్లో తారుమారు

second match against South Korea was held in a draw with India - Sakshi

కొరియాతో భారత్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

ఇపో (మలేసియా): ఎంతోకాలంగా భారత్‌ను వేధిస్తున్న చివరి నిమిషాల్లో తడబాటు సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లోనూ కొనసాగింది. జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా... దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌ను ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఆట 28వ నిమిషంలో మన్‌దీప్‌ సింగ్‌ చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మ్యాచ్‌ ముగియడానికి 22 సెకన్లు ఉందనగా కొరియా జట్టుకు భారత్‌ గోల్‌ సమర్పించుకుంది. చివరి నిమిషంలో కొరియాకు పెనాల్టీ కార్నర్‌ లభించగా... దానిని జాంగ్‌హున్‌ జాంగ్‌ గోల్‌గా మలిచాడు. దాంతో ఓడిపోయే మ్యాచ్‌ను కొరియా ‘డ్రా’గా ముగించగలిగింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top