రేపు సైనా, సింధుల సూపర్ ఫైట్ | Saina, Sindhu reach India Grand Prix Gold final | Sakshi
Sakshi News home page

రేపు సైనా, సింధుల సూపర్ ఫైట్

Jan 25 2014 7:09 PM | Updated on Sep 2 2017 3:00 AM

రేపు సైనా, సింధుల సూపర్ ఫైట్

రేపు సైనా, సింధుల సూపర్ ఫైట్

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, వర్ధమాన సంచలనం పీ వీ సింధుల మధ్య మరోసారి సూపర్ ఫైట్ జరగనుంది.

లక్నో: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, వర్ధమాన సంచలనం పీ వీ సింధుల మధ్య మరోసారి సూపర్ ఫైట్ జరగనుంది. ఇండియన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ ఫైనల్లో తెలుగుతేజాలిద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం ఫైనల్ పోరు జరగనుంది.

శనివారం జరిగిన మహిళల సింగిల్స్లో సెమీస్లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్ బెర్తులు దక్కించుకున్నారు. సెమీస్లో సింధు 21-6, 12-21, 21-17తో ఫనేట్రిపై పోరాడి గెలిచింది. మరో మ్యాచ్లో సైనా 21-14, 17-21, 21-19తో చైనా క్రీడాకారిణి ఝ్వాన్ డెంగ్పై అతికష్టమ్మీద నెగ్గింది. గంటా 20 నిమిషాల పాటు సాగిన పోరులో సైనా మూడు గేమ్ల్లో మ్యాచ్ను ముగించింది. పురుషుల సింగిల్స్లో కే శ్రీకాంత్ ఫైనల్ చేరాడు.

Advertisement
 
Advertisement
Advertisement