India Grand Prix Gold
-
సింధుపై సైనా మరోసారి విజయం
లక్నో: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి వర్ధమాన యువ సంచలనం పీవీ సింధుపై విజయం సాధించింది. తెలుగుతేజాల మధ్య ఆదివారం జరిగిన ఇండియా గ్రాండ్ ప్రి ఫైనల్లో విజయం సైనానే వరించింది. గతేడాదిగా ఫామ్‌లేమితో సతమతమైన సైనా ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-14, 21-17తో రెండో సీడ్ సింధును ఓడించింది. సైనా వరుసు గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గత 15 నెలల్లో సైనాకిదే తొలి ఫైనల్. సైనా అనుభవం ముందు సింధు దూకుడు పనిచేయలేదు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సైనా, సింధుల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో సైనా గెలిచింది. కాకతాళీయమే అయినా... గణతంత్ర దినోత్సవం రోజున మళ్లీ ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగింది. ................. -
రేపు సైనా, సింధుల సూపర్ ఫైట్
లక్నో: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, వర్ధమాన సంచలనం పీ వీ సింధుల మధ్య మరోసారి సూపర్ ఫైట్ జరగనుంది. ఇండియన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ ఫైనల్లో తెలుగుతేజాలిద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం ఫైనల్ పోరు జరగనుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సెమీస్‌లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్ బెర్తులు దక్కించుకున్నారు. సెమీస్‌లో సింధు 21-6, 12-21, 21-17తో ఫనేట్రిపై పోరాడి గెలిచింది. మరో మ్యాచ్‌లో సైనా 21-14, 17-21, 21-19తో చైనా క్రీడాకారిణి ఝ్వాన్ డెంగ్పై అతికష్టమ్మీద నెగ్గింది. గంటా 20 నిమిషాల పాటు సాగిన పోరులో సైనా మూడు గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో కే శ్రీకాంత్ ఫైనల్ చేరాడు. -
సెమీస్‌లో పీవీ సింధు
న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం, వర్ధమాన యువ సంచలనం పీవీ సింధు సెమీస్‌లో ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 21-11, 21-13తో ఇండోనేసియా షట్లర్ హెరా డెసిపై విజయం సాధించింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ లిండవెని ఫనెట్రితో అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్‌లో సింధు అలవోకగా నెగ్గింది. 34 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాదీ వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను వశం చేసుకుంది. సెమీస్ ప్రత్యర్థి డెసితో ముఖాముఖి మ్యాచ్‌ల్లో సింధుకు 3-2 రికార్డు ఉంది. గత టోర్నీలో సింధు రన్నరప్‌గా నిలిచింది.