సెమీస్లో పీవీ సింధు | Sindhu progresses to India Grand Prix Gold semis | Sakshi
Sakshi News home page

సెమీస్లో పీవీ సింధు

Jan 24 2014 7:04 PM | Updated on Sep 2 2017 2:57 AM

ఇండియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం, వర్ధమాన యువ సంచలనం పీవీ సింధు సెమీస్లో ప్రవేశించింది.

న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం, వర్ధమాన యువ సంచలనం  పీవీ సింధు సెమీస్లో ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 21-11, 21-13తో ఇండోనేసియా షట్లర్ హెరా డెసిపై విజయం సాధించింది. సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ లిండవెని ఫనెట్రితో అమీతుమీ తేల్చుకోనుంది.

క్వార్టర్స్లో సింధు అలవోకగా నెగ్గింది. 34 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాదీ వరుస గేమ్ల్లో మ్యాచ్ను వశం చేసుకుంది. సెమీస్ ప్రత్యర్థి డెసితో ముఖాముఖి మ్యాచ్ల్లో సింధుకు 3-2 రికార్డు ఉంది. గత టోర్నీలో సింధు రన్నరప్గా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement