
సింధుపై సైనా మరోసారి విజయం
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి వర్ధమాన యువ సంచలనం పీవీ సింధుపై విజయం సాధించింది.
లక్నో: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి వర్ధమాన యువ సంచలనం పీవీ సింధుపై విజయం సాధించింది. తెలుగుతేజాల మధ్య ఆదివారం జరిగిన ఇండియా గ్రాండ్ ప్రి ఫైనల్లో విజయం సైనానే వరించింది. గతేడాదిగా ఫామ్లేమితో సతమతమైన సైనా ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ కైవసం చేసుకుంది.
ఫైనల్లో టాప్ సీడ్ సైనా 21-14, 21-17తో రెండో సీడ్ సింధును ఓడించింది. సైనా వరుసు గేమ్ల్లో మ్యాచ్ను సొంతం చేసుకుంది. గత 15 నెలల్లో సైనాకిదే తొలి ఫైనల్. సైనా అనుభవం ముందు సింధు దూకుడు పనిచేయలేదు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సైనా, సింధుల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో సైనా గెలిచింది. కాకతాళీయమే అయినా... గణతంత్ర దినోత్సవం రోజున మళ్లీ ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగింది.
.................