సైనాకు తొలి పరీక్ష | Saina Nehwal first test | Sakshi
Sakshi News home page

సైనాకు తొలి పరీక్ష

Aug 7 2013 2:36 AM | Updated on Sep 1 2017 9:41 PM

సైనాకు తొలి పరీక్ష

సైనాకు తొలి పరీక్ష

తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

 గ్వాంగ్‌జూ (చైనా): తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. రష్యాకు చెందిన ఓల్గా గొలొవనోవాతో జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచ 66వ ర్యాంకర్ ఓల్గా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 21-13, 21-14తో అలీసియా జైత్సావా (బెలారస్)ను ఓడించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా, ఓల్గా ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి.
 
  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడనుంది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ కవోరి ఇమబెపు (జపాన్)తో తలపడుతుంది. గత ఏడాది జపాన్ ఓపెన్‌లో ఇమబెపుతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు గెలిచింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)తో కశ్యప్; పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట ప్రపంచ 15వ ర్యాంక్ జోడి మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా)తో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement