హాంగ్‌కాంగ్‌ సూపర్‌ సిరీస్‌ సెకండ్‌ రౌండ్‌లోకి సైనా | Saina enters second round; Kashyap, Sourabh lose in Hong Kong  | Sakshi
Sakshi News home page

హాంగ్‌కాంగ్‌ సూపర్‌ సిరీస్‌ సెకండ్‌ రౌండ్‌లోకి సైనా

Nov 22 2017 12:35 PM | Updated on Sep 2 2018 3:17 PM

 Saina enters second round; Kashyap, Sourabh lose in Hong Kong  - Sakshi

కౌలూన్‌: భారత బ్యా‍డ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ హాంగ్‌కాంగ్‌ సూపర్‌ సిరీస్‌ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో 44 వ ర్యాంకర్‌ డెన్మార్క్‌ ప్లేయర్‌ మెటే పౌల్సేన్‌పై 21-19, 23-21 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.11వ ర్యాంకరైన సైనా తదుపరి మ్యాచ్‌ బలమైన ప్రత్యర్థి ఎనిమిదో సీడెడ్‌ చైనా క్రీడాకారిణి చెన్‌ యుఫెయ్‌ను ఢీ కొననున్నారు. గత ఆగష్టులో గ్లాస్గో టోర్నమెంట్‌లో కాంస్యం కోసం పోటీపడ్డ సైనాను చెన్‌ మట్టికరిపించారు.

ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్‌, సౌరభ్‌ వర్మలు తొలి రౌండ్‌లోని ఓటమి చెంది ఇంటిదారి పట్టారు. కశ్యప్‌ కోరియా ప్లేయర్‌ లీడాంగ్‌ కీన్‌పై 21-15,19-21,20-22 తేడాతో ఓటమి చెందాడు. సౌరబ్‌ ఇండోనేషియా ప్లేయర్‌ టామ్మీ సుగియాట్రో చేతిలో ఓటమి పాలయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement