రెండో ర్యాంకుకు పడిపోయిన సైనా | Saina drops to World No.2 | Sakshi
Sakshi News home page

రెండో ర్యాంకుకు పడిపోయిన సైనా

Apr 9 2015 2:53 PM | Updated on Sep 3 2017 12:05 AM

రెండో ర్యాంకుకు పడిపోయిన సైనా

రెండో ర్యాంకుకు పడిపోయిన సైనా

హైదరాబాదీ స్టైలిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ బ్యాడ్మిమింటన్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకును కోల్పోయారు.

హైదరాబాదీ స్టైలిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ బ్యాడ్మిమింటన్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకును కోల్పోయారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో సైనా రెండో ర్యాంకుకు పడిపోయారు. ఒలింపిక్ చాంపియన్, చైనా క్రీడాకారిణి లీ జుయెరుయి తిరిగి నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నారు.

ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్..ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లో ఒటమి పాలవ్వడంతో సైనా నెహ్వాల్ గత నెలలో వరల్డ్ నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుని, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు స్థాపించింది. గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో పురుషుల సింగిల్స్ స్పెషలిస్ట్ తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ 4 పొజిషన్లో ఉన్నారు. ప్రణయ్ 14 వ ర్యాంకులో, రెండు ర్యాంకులు మెరుగు పర్చుకున్న పారుపల్లి కాశ్యప్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్ప జోడికి 18వ ర్యాంకు దక్కింది. కాగా పురుషుల డబుల్స్లో టాప్-25 ర్యాంకుల్లో భారతీయ క్రీడాకారులెవరికీ చోటుదక్కలేదు.

Advertisement
 
Advertisement
Advertisement