రన్నరప్‌ సాయిదేదీప్య జోడి | sai dedeepya pair as runner up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాయిదేదీప్య జోడి

Feb 11 2017 10:22 AM | Updated on Sep 5 2017 3:28 AM

జాతీయ ర్యాంకింగ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. భీమవరంలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో దేదీప్య జోడి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

 

శుక్రవారం జరిగిన ఫైనల్లో సాయిదేదీప్య– వై. సహజ (ఏపీ) ద్వయం 0–6, 2–6తో ఈతీ మహిత–సౌమ్య విగ్‌ (గుజరాత్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement