సెమీస్‌లో సాయిదేదీప్య | Sai Dedeepya Enters Semis Of All India Womens Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య

Oct 24 2019 10:02 AM | Updated on Oct 24 2019 10:02 AM

Sai Dedeepya Enters Semis Of All India Womens Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) సీవీజీ నాయుడు స్మారక ఆలిండియా మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఈ టోరీ్నలో దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సాయిదేదీప్య 6–1, 6–1తో షరోన్‌ విలియమ్స్‌ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది.

అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో ఆపేక్ష సోలంకీ (కర్ణాటక)పై గెలుపొందగా... తొలి రౌండ్‌లో తెలంగాణ ప్లేయర్‌ మౌలికరామ్‌ తప్పుకోవడంతో దేదీప్యకు వాకోవర్‌ లభించింది. ఇదే టోరీ్నలో మరో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రషి్మక క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–0, 6–1తో అదితి నారాయణన్‌పై నెగ్గింది. తొలి రౌండ్‌లో ఆమె 6–3, 6–0తో ఎస్‌బీ అపూర్వను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్‌ మ్యాచ్‌లో వన్షిత పతానియా (కర్ణాటక)తో దేదీప్య ఆడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement