అతని ఆట అమోఘం: సచిన్‌ | Sachin Tendulkar Praise on Prithvi Shaw | Sakshi
Sakshi News home page

అతని ఆట అమోఘం: సచిన్‌

Mar 11 2018 11:39 AM | Updated on Mar 11 2018 11:41 AM

Sachin Tendulkar Praise on Prithvi Shaw - Sakshi

సచిన్‌తో పృథ్వీషా (ఫైల్‌ ఫొటో)

సాక్షి​, ముంబై : యువ క్రికెటర్‌, అండర్‌-19 హీరో పృథ్వీషా రోజు రోజుకి తన ఆటలో పరిణితి చెందుతున్నాడని, గత అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించాడని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం ముంబై టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభించాకా ప్రసంగిస్తూ.. యువ క్రికెటర్లకు ఇదోక సువర్ణావకాశమని, ఈ లీగ్‌తో ముంబై క్రికెట్‌కు ఎంతో లాభం​ కలుగుతుందని సచిన్‌ తెలిపారు. రహానే సారథ్యం వహిస్తున్న నార్త్‌ ముంబై పాంథర్స్‌ జట్టులో పృథ్వీషా మరింత రాటుదేలాలన్నారు. ఈ టీ20 లీగ్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లు కష్టపడి ఆడుతూ, నాణ్యమైన ఆటగాళ్లుగా పేరు సంపాదించాలని సూచించారు. 

ఈ లీగ్‌లో ఆరు  జట్లు పాల్గొంటుండగా.. శ్రీలంక పర్యటన నేపథ్యంలో చాలా మంది యువ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.  మాస్టర బ్లాస్టర్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీకి  మాజీ దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ లీగ్ కమిషనర్ గా, దిలీప్ వెంగ్‌సర్కార్‌, సందీప్‌పాటిల్‌, వినోద్‌ కాంబ్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ ముంబై వాంఖెడే స్టేడియంలో జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement