కోహ్లి, అజామ్‌లను దాటేశాడు.. | Ryan ten Doeschate With Highest Average In ODIs | Sakshi
Sakshi News home page

కోహ్లి, అజామ్‌లను దాటేశాడు..

Oct 4 2019 2:56 PM | Updated on Oct 4 2019 2:57 PM

Ryan ten Doeschate With Highest Average In ODIs - Sakshi

అమెస్టర్‌డామ్‌: ప్రస్తుత క్రికెట్‌ శకంలో విరాట్‌ కోహ్లి, బాబర్‌ అజామ్‌, రోహిత్‌ శర్మలు తమదైన ఆటతో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరికి సవాల్‌ విసురుతున్నాడు నెదర్లాండ్‌ క్రికెటర్‌. కుడిచేతి వాటం ఆటగాడైన ర్యాన్‌ టెన్‌ డషెట్‌ తన వన్డే యావరేజ్‌లో కోహ్లి, అజామ్‌లను వెనక్కినెట్టాడు. 33 వన్డేల ఆడిన అనుభవం ఉన్న డషెట్‌ 32సార్లు బ్యాటింగ్‌ చేశాడు. మొత్తంగా 67.00 సగటుతో ఐదు సెంచరీల సాయంతో 1541 పరుగులు చేశాడు. దాంతో వన్డే ఫార్మాట్‌లో కనీసం వెయ్యి పరుగులు సాధించి అత్యధిక యావరేజ్‌ కల్గిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో నిలిచాడు.

ఇక్కడ కోహ్లి 60. 31తో రెండో స్థానంలో నిలిస్తే, బాబర్‌ అజామ్‌ 54.55 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. దీనికి ఒక స్పోర్ట్స్‌ చానెల్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను పోస్ట్‌ చేసింది. దీనిలో భాగంగా వారు కచ్చితంగా నీ కంటే యావరేజ్‌ కల్గిన బ్యాట్స్‌మన్‌ కాదంటూ ట్వీట్‌ చేసింది. దీనికి స్పందించిన డాషెట్‌.. కోహ్లి, బాబర్‌ అజామ్‌లకు క్షమాపణలు తెలియజేశాడు. ఇలా పోస్ట్‌ చేసినందుకు తాను క్షమాపణులు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement