టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా రోహిత్ శర్మ | Rohit Sharma Takes a Break From IPL to Play TT With His Wife | Sakshi
Sakshi News home page

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా రోహిత్ శర్మ

Apr 24 2017 5:30 PM | Updated on Sep 5 2017 9:35 AM

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా రోహిత్ శర్మ

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టెబుల్ టెన్నిస్ ప్లేయర్ గా అవతారమెత్తాడు.

ముంబై: ఐపీఎల్ నిలకడలేని ఫామ్ తో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టెబుల్ టెన్నిస్ ప్లేయర్ గా అవతారమెత్తాడు.  ఒత్తిడిని అధిగమించెందుకు తన భార్యతో సరదాగా టెబుల్ టెన్నిస్ ఆడాడు. సోమవారం రైజింగ్ పుణే తో జరిగే మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో రాణించాలని సిద్దమయ్యాడు. తన భార్య రితికా సాజ్ధే తో టెబుల్ టెన్నిస్ ఆడిన విడియోను రోహిత్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో టెబుల్ టెన్నిస్ ఆడుతూ  ఈ జంట సంతోషంగా గడిపింది.  మొదట్లో భార్యకు సపోర్ట్ గా ఆడిన రోహిత్, చివర్లో షాట్ కొట్టి రితికాపై పై చేయి సాధించాడు. రితికాకు టేబుల్ టెన్నిస్ లో శిక్షణ ఇస్లున్నట్లు రోహిత్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.

బ్యాటింగ్ లో రాణించ లేకపోతున్న రోహిత్ శర్మ కెప్టెన్ గా మాత్రం జట్టుకు వరుస విజయాలందిస్తూ పాయింట్ల పట్టికలో జట్టును అగ్రస్ధానంలో నిలిపాడు. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో మరో విజయాన్నితమ ఖాతాలో వేసుకుంది. ఇక్కడ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా నాల్గింటిలో విజయం సాధించి తమకు తిరుగులేదనిపించుకుంది. దీంతో  ఈ రోజు జరిగే పుణే తో జరిగే మ్యాచ్ కూడా గెలవాలని భావిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement