రోహిత్‌ @ 294 | Rohit Sharma 294 Sixes in 294 Matches | Sakshi
Sakshi News home page

రోహిత్‌ @ 294

Sep 20 2018 1:24 PM | Updated on Sep 20 2018 2:08 PM

Rohit Sharma 294 Sixes in 294 Matches - Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. బుధవారం దుబాయి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ రోహిత్ శర్మకు 294వ అంతర్జాతీయ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు సాధించిన రోహిత్‌ శర్మ తన అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్యను 294కు పెంచుకోవడం మరో విశేషం.  ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ 185 వన్డేలు, 25 టెస్టులు, 84 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇక్కడ వన్డేల్లో సాధించిన సిక్సర్ల సంఖ్య 176 కాగా, టెస్టుల్లో 29 సిక్సర్లు సాధించాడు. ఇక ఇంటర్నేషనల్‌ టీ20ల్లో 89 సిక్సర్లను రోహిత్‌ కొట్టాడు.

పాకిస్తాన్‌పై భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత జట్టు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement