ప్రాక్టీస్‌ను రిషభ్‌ కామెడీ చేశాడు..! | Rishabh Pants After Workout Video Looks Like A Comedy Scene | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌ను రిషభ్‌ కామెడీ చేశాడు..!

Jan 5 2020 5:57 PM | Updated on Jan 5 2020 6:00 PM

Rishabh Pants After Workout Video Looks Like A Comedy Scene - Sakshi

గుహవాటి: ఇటీవల కాలంలో తన ఆటతీరుతో, నిలకడలేమితో, కీపింగ్ లో వరుస వైఫల్యాలు చూస్తున్న టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. తన నైపుణ్యాలను పెంచుకునే పనిలో ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. దీనిలో భాగంగా ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో  స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ తో ప్రాక్టీస్‌ను పంచుకున్నాడు. ఇందులో కొన్ని బాక్సింగ్‌ పంచ్‌లను రిషభ్‌ ప్రాక్టీస్‌ చేశాడు.

ఈ వీడియోతో పాటు సెకాండాఫ్‌లో చహల్‌, సంజూ శాంసలన్‌లతో కలిసి ఉన్న వీడియోను ఒకటి షేర్ చేశాడు. దీనికి వర్కౌట్‌ సమయంలో.. వర్కౌట్స్‌ తర్వాత అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇక్కడ సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేయడానికి బదులు రిషభ్‌ కామెడీ చేసినట్లే కనబడింది. దీనిపై అభిమానులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ‘ ఇదేదో ఆటలో చూపించు వచ్చు కదా’ అని ఒక అభిమాని పేర్కొనగా, ‘ ఇంతటి వర్కౌట్స్‌ చేసేవాడివి గ్రౌండ్‌లో కొన్ని పరుగులు చేస్తే బాగుంటుంది’ అంటూ ఎద్దేవా చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement