ఓర్నీ..! క్రీజ్‌లోకి రాకుండా రైనాను అడ్డుకున్న పంత్‌!

Rishabh Pant Blocks Suresh Raina from taking strike - Sakshi

రిషభ్‌ పంత్‌ గురించి చెప్పాలంటే.. మైదానంలో తన బ్యాటుతో ధడధడలాడించగల బ్యాట్స్‌మన్‌. వికెట్‌ కీపర్‌గానూ రోజురోజుకు మెరుగుపడుతున్నాడు. అంతేకాదు, మైదానంలో చక్కిలిగింతలు పెట్టే ప్రాంక్‌స్టర్‌ కూడా. తన సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌తో అప్పుడప్పుడు తోటి ఆటగాళ్లను పంత్‌ ఆటపట్టిస్తుంటాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ చెప్పాక్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ ఢిల్లీ వికెట్‌ కీపర్‌ తనదైన హాస్యాన్ని పండించాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ మంచి ఆరంభాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్‌ ఆడుతున్న జగదీషా సుచిత్‌ షేన్‌ వాట్సన్‌ను డకౌట్‌ చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో సురేశ్‌ రైనా మైదానంలోకి వచ్చాడు. అయితే, క్రీజులోకి వెళుతుండగా అతన్ని పంత్‌ అడ్డుకున్నాడు. క్రీజ్‌లోకి రైనా వెళ్లకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. ఇటు కదిలితే ఇటు, అటు కదిలితే అటు అడ్డుకుంటూ కొన్ని సెకన్లపాటు రైనాను పంత్‌ ఆటపట్టించాడు. చివరకు పంత్‌ తొలిగి దారి ఇవ్వగా రైనా క్రీజ్‌లోకి ఇచ్చాడు. దీంతో ఇద్దరు నవ్వులు చిందించారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ మ్యాచ్‌లో నవ్వులు పూయించింది. ఈ సీజన్‌లో ఫామ్‌పరంగా కష్టాలు ఎదుర్కొంటున్న సురేశ్‌ ఢిల్లీతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి సత్తా చాటాడు. 37 బంతుల్లో 59 పరుగులు చేసిన రైనాను జగదీశ్‌ సుచిత్‌ రెండోవికెట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌, స్టంపింగ్‌ మ్యాజిక్‌, స్పిన్నర్లు సత్తా  చాటడంతో సూపర్‌కింగ్స్‌ 80 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top