
మళ్లీ మ్యాక్స్‌వెల్ మోత
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో చెలరేగిపోయాడు.
* రెండో టి20లోనూ లంక చిత్తు
* 2-0తో సిరీస్ ఆసీస్ కైవసం
కొలంబో: గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. ఫలితంగా శ్రీలంకతో శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వ (50 బంతుల్లో 62; 5 ఫోర్లు) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు.
తన ఆఖరి మ్యాచ్‌లో దిల్షాన్ (1) విఫలమయ్యాడు. జంపా, ఫాల్క్‌నర్ మూడేసి వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 17.5 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్, వార్నర్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 51 బంతుల్లోనే 93 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. మ్యాక్స్‌వెల్ ఆసీస్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (18 బంతుల్లోనే) నమోదు చేయడం విశేషం. దిల్షాన్‌కు 2 వికెట్లు దక్కారుు. ఈ మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అయ్యాడు. మూడు ఫార్మాట్‌లు కలిపి మొత్తం 497 మ్యాచ్‌లలో 17,671 పరుగులు, 152 వికెట్లతో అతను కెరీర్‌ను ముగించాడు.