ఐపీఎల్‌: ఆర్సీబీ అరుదైన ఘనత

RCB Register Third 10 Wicket Victory in IPL - Sakshi

రికార్డుకెక్కిన ఉమేశ్‌, కోహ్లి

ఇండోర్‌ : ఐపీఎల్‌లో రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు అరుదైన రికార్డును నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది ఈసీజన్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అంతేగాకుండా ఇలా వికెట్‌ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గెలవడం బెంగళూరుకు ఇది మూడో సారి కాగా.. ఏ జట్టు కూడా ఇలా ఒకసారికి మించి గెలవలేకపోవడం విశేషం. 2010 సీజన్‌లో తొలి సారి రాజస్తాన్‌ రాయల్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించిన ఆర్సీబీ.. 2015లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై 96 పరుగుల లక్ష్యాన్ని మరోసారి ఛేదించింది. ఇక తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించి ఐపీఎల్‌ చరిత్రల్లో మూడు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు స్పష్టించింది.

ఉమేశ్‌, కోహ్లిల రికార్డు..
పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి పంజాబ్‌పై ఐదో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకోగా..  ఐదు సీజన్లలలో 500కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డుకెక్కాడు. వార్నర్‌ 4 సార్లు ఈ ఘనత సాధించాడు.   ఉమేశ్‌ యాదవ్‌ తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ (దక్కన్‌ చార్జర్స్‌పై) మాత్రమే ఒకే ప్రత్యర్థిపై ఐదు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top