సిడ్నీ టెస్ట్: అశ్విన్ హాఫ్ సెంచరీ | ravichandran ashwin gets an half century | Sakshi
Sakshi News home page

సిడ్నీ టెస్ట్: అశ్విన్ హాఫ్ సెంచరీ

Jan 9 2015 8:48 AM | Updated on Sep 2 2017 7:27 PM

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.  శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది.

 

అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే భువనేశ్వర్ కుమార్(30)పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 455 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement