రష్మీకి స్వర్ణం | rashmi rathord won gold medal in shooting championship | Sakshi
Sakshi News home page

రష్మీకి స్వర్ణం

Dec 15 2013 1:51 AM | Updated on Sep 2 2017 1:36 AM

జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రష్మీ రాథోడ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల స్కీట్ ఈవెంట్‌లో రష్మీ విజేతగా నిలిచింది.

జాతీయ సీనియర్ షూటింగ్
 న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రష్మీ రాథోడ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల స్కీట్ ఈవెంట్‌లో రష్మీ విజేతగా నిలిచింది. ఆర్తి సింగ్ (ఎయిరిండియా) రజతం సాధించగా... సమియా షేక్ (చత్తీస్‌గఢ్) కాంస్యం గెల్చుకుంది. రష్మీ మొత్తం 60 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది.
 
  పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత విజయ్ కుమార్ పసిడి పతకాన్ని నెగ్గాడు. పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్‌లో అమిత్ సంఘీ, వికార్ అహ్మద్, శ్రేయన్ కపూర్‌లతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందానికి కాంస్యం లభించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో శ్రేయన్ కపూర్‌కు కాంస్య పతకం దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement